“బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రభాస్ కొత్త చిత్రం “రాధే శ్యామ్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో 75 కోట్లు సెట్స్‌కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. “రాధే శ్యామ్”లో కొన్ని విలాసవంతమైన, పాతకాలపు సెట్‌లను సినిమాలో వీక్షించొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి పెద్ద అసెట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
Read Also : Prabhas : ‘ఆర్ఆర్ఆర్’లో ప్రభాస్ అందుకే మిస్సయ్యాడా ?
“రాధే శ్యామ్” కథ యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ప్రారంభంలో మేకర్స్ ఇటలీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. దీంతో ఇటలీని భారత్‌లోనే క్రియేట్ చేశారు. సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ హైదరాబాద్‌లో భారీ సెట్‌లు వేశారు. ఈ సినిమా కోసం మొత్తం 101 సెట్లు వేసినట్లు వినికిడి. ఇందులో రైలు, రైల్వే స్టేషన్, ఓడ, కాఫీ షాప్, హీరోయిన్ ఇల్లు, ఛాపర్, ఆసుపత్రి వంటి సెట్ ఉన్నాయి. ఈ సెట్స్ అన్నీ సినిమాకి గ్రాండియర్ లుక్ ని తీసుకురాబోతున్నాయట. ఈ భారీ సెట్‌లలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు ప్రేక్షకులు. ఇక సినిమాలో షిప్ సీన్ హైలెట్ అని రాజమౌళితో తాజాగా జరిగిన చిట్ చాట్ లో పప్రభాస్ వెల్లడించారు.
