Site icon NTV Telugu

‘7 డేస్ 6 నైట్స్’ టీనేజ్ ఫన్ ఫిల్మ్: మెహర్ చాహల్

New Project (36)

New Project (36)

నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో హిట్ కొట్టిన ఎం.ఎస్.రాజు తాజా చిత్రమిది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించింది.

‘మాది అస్సాం. మా నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. దాంతో దేశంలో పలు ప్రాంతాలు తిరిగి ముంబైలో సెటిల్ అయ్యాం. గతంలో కొన్ని సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. అవి చూసిన ఎం.ఎస్ రాజు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ చేయమన్నారు. చేశాను. ఎంపిక అయ్యాను. ఇదొక ఫన్ ఫిల్మ్. టీనేజ్ కథ. ఇక ఇందులో నా పాత్ర పేరు రతికా. గోవా రెస్టారెంట్‌లో పని చేసే టీనేజ్ అమ్మాయి పాత్ర. సుమంత్ అశ్విన్ జోడీగా కనిపిస్తా. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. షూటింగ్ లో చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. నిజంగా ట్రిప్‌కి వెళ్లినట్టు అనిపించింది. బోల్డ్ రోల్ అనుకుంటారు కానీ కాదు. స్విమ్ సూట్ ఉంటుంది. వల్గర్‌గా ఏమీ ఉండదు.
‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకు ముందే ఎంఎస్ రాజు గారితో మరో సినిమా ‘సతి’ చేస్తున్నా. అందులోనూ సుమంత్ అశ్విన్ హీరో. అదొక థ్రిల్లర్. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా అని అంటోంది మెహర్ చాహల్. తనకు నచ్చిన నటీనటులు కల్కి కొచ్చిన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ అని చెబుతూ తెలుగు సినిమాలు తక్కువ చూశానని, ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, ధనుష్ హిందీలో సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు తెలుసని చెబుతోంది. ఇక ‘7 డేస్ 6 నైట్స్’ యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా అని… పోస్టర్స్ చూసి యంగస్టర్స్‌ వచ్చినా, తర్వాత ఫ్యామిలీతో కూడా వచ్చి చూస్తారనే నమ్మకాన్ని వక్తం చేస్తోంది మెహర్.

Exit mobile version