NTV Telugu Site icon

Arjun Reddy: ఇండస్ట్రీని మార్చేసిన సినిమాకు ఆరేళ్ళు.. అతనిని మిస్ అవుతున్నాను అన్న డైరెక్టర్

Vijay

Vijay

Arjun Reddy: ఏ రంగంలో అయినా మార్పులు సహజమే. కానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్ర ఆ మార్పు ఎన్నో కొత్త పునాదులను వేసేలా చేస్తోంది. ప్రతి జనరేషన్ ను ఒక సినిమా మార్చేస్తుంది. మూస ధోరణిలో వెళ్లే ఇండస్ట్రీ రూపు రేఖలను మార్చేస్తుంది. అలా టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. టాలీవుడ్ లో అప్పటివరకు ముద్దు సీన్లు అంటే.. పూలు పెట్టి చూపించాలి.. హీరో హీరోయిన్లు పెదాలు చూపించాలి.. ఇక బూతులు అంటే సెన్సార్ అస్సలు సమస్యే లేదు అని తీసిపడేసేది. అలాంటి తరుణంలో వచ్చింది అర్జున్ రెడ్డి. ఒక ఇంటెన్సివ్ లవ్ స్టోరీ.. టాలీవుడ్ షేప్ నే మార్చేసింది. ఆరేళ్ళ క్రితం ఇదే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్ని వివాదాలను తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లిప్ కిస్ పోస్టర్స్ ను బయట అతికించడంతో మొదలైన వివాదం.. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరో బూతులు మాట్లాడండి అని చెప్పేవరకు వెళ్ళింది. అర్జున్ రెడ్డి .. ఒక సాధారణ హీరో హీరోయిన్లను.. ఓవర్ నైట్ లో స్టార్లను చేసేసింది. ఒక డైరెక్టర్ ను పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది. వారే.. విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగా.

Raai Laxmi: పాల మీగడ లాంటి దేహంపై నల్లని బికినీ.. కుర్రకారుకు నిద్ర కరువే

ముఖ్యంగా సందీప్.. తన కథలో చూపించిన ప్రేమ .. అభిమానులను పిచ్చివాళ్లను చేసింది. ప్రేమించిన అమ్మాయిని.. అబ్బాయి కొట్టడం కూడా ప్రేమనే అని చెప్పింది. పిచ్చిగా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేని అమ్మాయి.. మరొక అబ్బాయితో ఉండలేదని నిరూపించింది. ఇక ఇందులో అన్నదమ్ముల మధ్య అనుబంధం.. ముఖ్యంగా స్నేహితులు.. ఫ్రెండ్ ఎలాంటి వాడు అయినా.. సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండాలని చూపించింది. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ సినిమా ట్రెండ్ ను మార్చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్ళు కావస్తుండడంతో.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎమోషనల్ ట్వీట్ చేశాడు. సినిమాకు ఫిల్లర్ గా నిలిచిన సీన్.. కుర్చీలో అర్జున్ రెడ్డి కూర్చొని కూల్ డ్రింక్ లో మందు కలుపుకుని తాగుతూ ఉంటాడు. ఆ మేకింగ్ వీడియోను పంచుకుంటూ సందీప్ “అర్జున్ రెడ్డికి ఆరేళ్ళు.. డార్లింగ్ DVS (దేవరకొండ విజయ్ సాయి) నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చూసినప్పుడు.. థాంక్యూ అర్జున్ రెడ్డి టీమ్ ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments