Salaar: డైనోసర్ ఎంట్రీకి 50 రోజులే ఉంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తూ.. మోస్ట్ వయోలెంట్ మాన్ అంటూ హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లాడు. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడింది.
రెండు నెలలు వాయిదా పడిన సలార్ సినిమాతో ప్రభాస్.. డిసెంబర్ 22న డైనోసర్ గా బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యగల సత్తా ఉన్న సలార్ మూవీ.. సరిగ్గా మరో యాభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. #50DaysToSalaarCeaseFire అంటూ హ్యాష్ ట్యాగ్ ని స్టార్ట్ చేస్తూ హోంబలే నుంచి వచ్చి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 50 రోజుల్లో బాక్సాఫీస్ బద్దలవబోతోంది… అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఈ మంత్ ఎండింగ్ కి సలార్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వన్స్ సలార్ సాంగ్ బయటికొస్తే… సలార్ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యరెంటీ. ఏదేమైనా… మరో యాభై రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సలార్ అనే భారీ తుఫాన్ రాబోతోందని చెప్పొచ్చు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
#50DaysToSalaarCeaseFire 🔥 pic.twitter.com/J098BAqWAf
— Salaar (@SalaarTheSaga) November 2, 2023
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!