మోహన్ బాబు 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయనకు 47 సంవత్సరాలు ఏంటని ఆశ్చర్యపోకండి. నటుడుగా ఆయన వయసు ఇది. నవంబర్ 22, 1975న విడుదలైన ‘స్వర్గం నరకం’ సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఇది. ఇది మంచు కుటుంబ అభిమానులకు సంతోషకరమైన రోజు. దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఎంతో మంది కెరీర్ కు పూల బాట వేసింది. మోహన్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రాలలో ఒకటి ఈ ‘స్వర్గం నరకం’.
Read Also : పవన్ తో రాజమౌళి భేటీ… కథ ఎక్కడికి దారి తీస్తోంది ?
ఈ సినిమా ఆ తరువాత బాలీవుడ్లో ‘స్వర్గ నరక్’ పేరుతోనూ, తమిళంలో ‘సొర్గం నరగం’ పేరుతో రీమేక్ అయింది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నంది అవార్డును కూడా గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇటీవల మోహన్ బాబు తమ్ముడు మంచు రంగనాథ నాయుడు మరణించిన కారణంగా ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వేడుకలు జరుపుకోవటం లేదు.