పవన్ తో రాజమౌళి భేటీ… కథ ఎక్కడికి దారి తీస్తోంది ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’.

“భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పి
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధర జీవో “ఆర్ఆర్ఆర్”కి అతిపెద్ద అడ్డంకిగా మారగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” రూపంలో మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది.

Read Also : హనీ ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్… కోట్ల నగదు స్వాధీనం

రాజమౌళి ప్లాన్ ఏంటంటే?
రెండు సినిమాలూ వారం గ్యాప్ తో విడుదలకు సిద్ధమవుతుండగా, ఇది ఖచ్చితంగా “ఆర్ఆర్ఆర్” సినిమా కలెక్షన్‌లకు గండి కొడుతుంది. పైగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ గురించి కొనుగోలుదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో “భీమ్లా నాయక్” విడుదలను వాయిదా వేయమని రిక్వెస్ట్ చేయడానికి రాజమౌళి, పవన్ ను ప్రత్యేకంగా కలవబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి సినిమాల విడుదల గురించి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య చర్చలు జరగగా అవి సఫలం కాలేదు. ఇందులో ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ను వెనక్కి తగ్గమంటూ మిగతా నిర్మాతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

“భీమ్లా నాయక్” వెనక్కి తగ్గుతాడా ?
రాజమౌళి, పవన్ సమావేశాని కంటే ముందు నిర్మాతలు దానయ్య, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీతో పాటు ఇతరులు డైరెక్టర్ త్రివిక్రమ్‌ని కలవడానికి ప్లాన్‌ చేస్తున్నారని, ‘భీమ్లా నాయక్’ విడుదలను వాయిదా వేసి, ‘ఆర్ఆర్ఆర్’ కోసం రూట్ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాల తర్వాత మరి “భీమ్లా నాయక్” తలొగ్గుతాడా? అంటే డౌటే ! నిన్ననే నిర్మాత నాగవంశీ మరోమారు సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ‘భీమ్లా నాయక్’ ముందుగా చెప్పినట్టే సంక్రాంతికి విడుదల అవుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు. దీంతో ఆయనపై ఇటు ‘ఆర్ఆర్ఆర్’, అటు ‘రాధేశ్యామ్’ మేకర్స్ అన్ని వైపులా నుంచీ ‘భీమ్లా నాయక్’ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడి కారణంగా ‘భీమ్లా నాయక్’ వెనకడుగు వేస్తాడా? అనేది చూడాలి.

Related Articles

Latest Articles