NTV Telugu Site icon

Kantara: ‘కాంతార’ శబ్దాలకు గుండెపోటు.. అభిమాని మృతి

Kantara

Kantara

Kantara:కాంతార కలక్షన్స్ కొద్దిగా కూడా తగ్గేలా కనిపించడం లేదు. అన్ని చోట్లా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ల దిశగా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి రికార్డులు సృష్టిస్తోంది. ఎన్ని వివాదాలు సినిమా చుట్టు ముసిరినా చెక్కుచెదరకుండా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంతార సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఈ సినిమాను చూస్తూ ఒక అభిమాని థియేటర్ లోనే కన్నుమూసిన సంగతి తెల్సిందే.

గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని భాగమంగళ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాంతార సినిమా చూస్తూ కూర్చున్న సీటులో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ శబ్దాలకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి సీట్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతనిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చాలామంది సినిమాకు వెళ్లాలంటే భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే రాజశేఖర్ కు ముందు నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి గుండెపోటు సినిమాలోని శబ్దాల వలన రాలేదని మరికొందరు చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.