NTV Telugu Site icon

Dear Comrade: రిలీజ్ అయినప్పుడు ప్లాప్ అని .. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటారేంటిరా బాబు

Vuijay

Vuijay

Dear Comrade: ప్రేక్షకులు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. అక్కడ కూడా అదే అంచనాలను పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలు ఆ సినిమా అందుకోకపోతే సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. ఆ అంచనాలు అన్ని తగ్గాకా ఓటిటీలో సినిమా చూసి అరే ఈ సినిమా కూడా బానే ఉందే అని చెప్పేస్తారు. ఇంకొంతమంది చూడగా.. చూడగా మంచి సినిమా, కల్ట్ క్లాసిక్ అని మెచ్చేసుకుంటారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా అలాంటి ప్రశంసలనే అందుకుంటుంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమాతో విజయ్ పై ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. దీంతో ఆ సినిమా తరువాత విజయ్ నటించిన ప్రతి సినిమాపై ఆ అంచనాలు పెట్టేసుకున్నారు అభిమానులు. ఇక డియర్ కామ్రేడ్ ను కూడా అదే రీతిలో చూసారు.

నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజునే ఫ్యాన్స్.. బాబోయ్.. పెద్ద ప్లాప్ అని చెప్పుకొచ్చేసారు. సినిమా ల్యాగ్ అని, విజయ్, రష్మిక ముద్దులు తప్ప ఏం లేవని చెప్పుకొచ్చారు. ఇక దీంతో విజయ్ కెరీర్ లో భారీ పరాజయాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమ నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మరోసారి అభిమానులు ఈ సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. సినిమా బావుంటుంది అని, కల్ట్ క్లాసిక్ అని చెప్పుకొస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ అయినప్పుడు ప్లాప్ అని .. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటారేంటిరా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments