NTV Telugu Site icon

ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ లో 4 సినిమాలు

Tollywood Movies

Tollywood Movies

ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ కు 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. పుష్పక విమానం, రాజా విక్రమార్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’తో పాటు ‘కురుప్’ అనే డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

పుష్పక విమానం
ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. పెళ్ళాం లేచిపోయింది అంటూ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని పని చేస్తున్నారు. “పుష్పక విమానం” రేపు భారీ స్థాయిలో విడుదల కానుంది. సినిమా ప్రేక్షకులకు బాగా చేరువయ్యేలా మేకర్స్ చూసుకోవడంతో ప్రమోషన్స్ బాగా క్లిక్ అయ్యాయి. దానికో తోడు ఆనంద్ దేవరకొండ సోదరుడు విజయ్ దేవరకొండ కూడా సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోవడం సినిమాపై హైప్ ని పెంచేసింది.

Read Also : సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారిన దుబాయ్

రాజా విక్రమార్క
ఒకవైపు విలన్ గా, మరోవైపు హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీలో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది.

కురుప్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 12న ఐదు భారతీయ భాషలలో విడుదల కానుంది.

తెలంగాణ దేవుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా వడత్య హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్‌ నటించిన ఈ సినిమాతో జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రేపు థియేటర్లలోకి రానుంది.