Thudakkam : 9 రోజుల్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. స్టార్ హీరో కూతురుకు తొలిసినిమాతోనే భారీ హిట్

Thudakkam

Thudakkam

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ నాయికగా పరిచయమైన చిత్రం తొడక్కమ్‘. ఈనెల 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ట్ అందుకుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లను సాధిస్తూ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 36.73 కోట్ల గ్రాస్ వసూలు చేసి సాలిడ్ బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తోంది. ఈ 9 రోజుల వ్యవధిలో రీజనల్ వైజ్‌గా ఈ సినిమా కేరళలో రూ. 19.69 కోట్లు, కర్ణాటక రూ. 1.35 కోట్లు, తమిళనాడు రూ. 35 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 71 లక్షలు మొత్తం డొమెస్టిక్ గ్రాస్ రూ. 22.10 కోట్లు రాబట్టగా ఓవర్సీస్: $1.54 మిలియన్లు అంటే సుమారు రూ. 14.63 కోట్లుతో టోటల్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 36.73 కోట్లు వసూళ్లు చేసింది. కేవలం 9 రోజుల్లోనే రూ. 36 కోట్ల మైలురాయిని అధిగమించిన ‘తుడక్కమ్’, ఈ ఏడాదో వచ్చిన ‘బాలన్’ సినిమా ఫైనల్ రన్ రికార్డులను సైతం క్రాస్ చేసింది. తద్వారా ఈ సంవత్సరానికి గానూ మలయాళంలో 6వ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఎలాంటి హెవీ అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేస్తూ మోలీవుడ్ స్థాయిని మరోసారి చాటిచెప్పింది. తొలి సినిమాతోనే మోహన్ లాల్ కూతురు సాలిడ్ హిట్ అందుకుని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది.