Site icon NTV Telugu

30 years PrudhviRaj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత..

Prudvi

Prudvi

30 years PrudhviRaj: టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గాసెటిల్ అయ్యిపోయాడు. కమెడియన్ గా కామెడీ విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పృథ్వీ రాజ్.. మొట్టమొదటిసారి డైరెక్టర్ మైక్ పట్టుకున్నాడు. మంచి కథతో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేస్తూ కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పృథ్వీ రాజ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఆ సినిమా గురించి అధికంగా ఆలోచించడంతోనే ఆయన అస్వస్థత కు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం పృథ్వీ రాజ్ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

The Kerala Story: కేరళ స్టోరీ సినిమా టికెట్ చూపిస్తే కాఫీ, టీ ఫ్రీ..

ఇక బెడ్ మీద పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్‌ గా తొలిసారి సినిమా తీయబోతున్నా. ఇలా అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా. నా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి.. ఈ నెల 26న ఇంకా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. మా సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి” అంటూ ఆయన కోరారు. అయితే ఈ హాస్పిటల్ వీడియో ప్రమోషన్స్ కోసం అయితే కాదుగా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కూతురు కోసం పృథ్వీ రాజ్ చేసిన ప్రయత్నం ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version