30 Years Industry Prudhvi Raj joins Janasena: పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు పృథ్వీ భేటీ అయ్యారు. గతంలో నుంచే జనసేనకి మద్దతుగా ఉంటూ వస్తున్న ఆయన ఈరోజు తన కుమార్తెతో కలిసి పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ – జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చ జరిపామని అన్నారు. ఈ క్రమంలో సినీ నటుడు పృధ్వీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని అన్నారు. శ్యాంబాబు వేషధారణతోనే టీడీపీ – జనసేన తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్న ఆయన అందరూ కోరుకుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషధారణతో ప్రచారం ప్రారంభిస్తానని అన్నారు. ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందని పేర్కొన్న ఆయన నేను ఏ టిక్కెట్ ఆశించడం లేదు.. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదని అన్నారు.
Shiva Karthikeyan: రోబో, 2.O సినిమాల్లో కంటే ‘అయలాన్’లోనే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్!
ఏ పదవీ ఆశించడం లేదని పేర్కొన్న పృథ్వి టీడీపీ – జనసేన ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దూషణలు లేని ప్రచారం చేస్తామని పేర్కొన్న ఆయన తన సీనియర్ ఆలీ వైసీపీ తరపున ఉన్నా.. ఎవరి ప్రచారం వారిదేనని అన్నారు. ఇక మరోపక్క ఈరోజు పవన్ తో ఉత్తరాంధ్ర కీలక నేత కొణతాల భేటీ అయ్యారు. వైసీపీని వీడిన ఆయన జనసేన పార్టీలో చేరిక, అనకాపల్లిలో బహిరంగ సభ నిర్వహణపై పవన్ తో చర్చలు జరిపారు. ఇక ఉత్తరాంధ్ర అంశాలపై కూడా పవన్ తో చర్చలో ప్రస్తావించారు. జనసేన నుంచి అనకాపల్లి లోక్ సభ టికెట్ ఆశిస్తున్నారు కొణతాల. ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ తో గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ భేటీ అయ్యి పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. గూడూరు టికెట్ వేరొకరికి ఇస్తుండడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇక స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా జనసేనలో జాయిన్ అయ్యారు.