Site icon NTV Telugu

3 Roses : ‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ రిలీజ్.. అదరగొట్టిన సత్య..

Satya

Satya

3 Roses : కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు సత్య. ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 రోజెస్’ సీజన్ 2. ఇందులో ఈషారెబ్బా, వైవా హర్ష, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సత్య పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో ఆయన బెట్టింగ్‌ భోగి పాత్రలో అలరించబోతున్నాడని తెలుస్తోంది.

Read Also : Nara Lokesh: పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు!

ఈ సిరీస్ కు మొదటి పార్టు ఇప్పటికే మంచి హిట్ అయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2ను తీసుకొస్తున్నారు. కిరణ్‌ కారవల్ల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్‌-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీలో కూడా సత్య నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు సత్య కమెడియన్ గా మంచి రోల్స్ చేస్తున్నాడు.

Read Also : Rajnath Singh: ఏఐ ఆధారిత అమ్కా యుద్ధ విమానం.. రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదం

Exit mobile version