2K Lovers: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో తెలంగాణా నేపధ్యంలో సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మరో సినిమా కూడా ప్రారంభమైంది. ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘2కె లవర్స్’ (Soul of Love). బిచ్చు నాయక్ నిర్మాణంలో, రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. మోహిత్, శృతి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రసూల్ భాయ్ కథను అందించారు.
ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ క్రమంలో దర్శకుడు రాజేష్ నాయుడు: “తెలంగాణ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమకథ ఇది. వినోదంతో పాటు ప్రేక్షకుల హృదయాలను కదిలించే భావోద్వేగాలు ఉంటాయి. రసూల్ గారు రాసిన కథ సినిమాకు ప్రాణం.” అని అన్నారు. నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ “తెలంగాణ యాస, సంస్కృతి నేపథ్యంలో ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇది. థియేటర్ల నుంచి బయటకు వచ్చినా కథ అందరినీ వెంటాడుతుంది.” అన్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా, పవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?