తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్ విషయం కాసేపు పక్కన పెడితే ఈ సంక్రాంతి వచ్చే సినిమాలు అసలు ఏ ఓటీటీలో కనిపించబోతున్నాయి, ఏ సాటిలైట్ ఛానెల్ ఈ సినిమాల హక్కులని కొనుక్కుంది అనే విషయాలని ఒకసారి చూద్దాం.
- గుంటూరు కారం: నెట్ఫ్లిక్స్… మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. స్కై హై ఎక్స్పెక్టేషన్స్ మైంటైన్ చేస్తున్న గుంటూరు కారం సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా, సాటిలైట్ రైట్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
- హనుమాన్: జీ5… చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హనుమాన్ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది కాబట్టి హనుమాన్ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ 5 సొంతం చేసుకోగా… సాటిలైట్ రైట్స్ కూడా జీ-టీవీ చేతికే వెళ్లాయి.
- సైంధవ్: అమెజాన్ ప్రైమ్… వెంకీ మామ, శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ మూవీ సైంధవ్. జనవరి 13న రిలీజ్ కానున్న ఈ మూవీతో వెంకీ మామా చాలా రోజుల తర్వాత యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సొంతం చేసుకుంది.
- నా సామిరంగ: అమెజాన్ ప్రైమ్… కింగ్ నాగ్ మాస్ లుక్ లో కనిపిస్తూ చేస్తున్న సినిమా నా సామిరంగ. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. స్టార్ మా చేతికి నా సామిరంగ సాటిలైట్ రైట్స్ అందాయి.
మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఆడుతాయి? ఎన్ని కోట్లు రాబడుతాయి? ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తాయి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.