Pooja Hegde: 2022 అంత బ్యాడ్ ఇయర్ ని పూజా ఎప్పుడూ చూసి ఉండదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో పూజా హెగ్డే బాలీవుడ్ లో సెటిల్ అయిపోతుందని అంతా అనుకున్నారు కానీ ఆ మూవీ డిజాస్టర్ అవ్వడంతో పూజా మళ్లీ సౌత్ వైపు చూడాల్సి వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత 2017లో అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకోని సౌత్ స్టార్ హీరోస్ తో నటించడం మొదలుపెట్టింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబులాంటి స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా 2018 పూజా హెగ్డేకి గోల్డెన్ పీరియడ్ లాంటిది, ఆ ఏడాది రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో ‘జిగేలు రాణీ’ సాంగ్ ని మాస్ డాన్స్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఇదే ఏడాది పూజా, ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది. 2018 ఇచ్చిన జోష్ లో 2019లో మూడు సినిమాలు చేసిన పూజా హెగ్డే ‘హౌజ్ ఫుల్ 4’ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. 2020, 2021లో పూజా రెండు హిట్స్ కొట్టింది కానీ తర్వాతే పూజా హెగ్డే కెరీర్ లో కష్టాలు మొదలయ్యాయి. 2022 పూజా హెగ్డే కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేజ్ అని చెప్పాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
2022లో పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాలు చేసింది. ప్రభాస్ తో ‘రాధే శ్యాం’, దళపతి విజయ్ తో ‘బీస్ట్’, చిరు-చరణ్ లతో ‘ఆచార్య’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ లాంటి భారి బడ్జట్ సినిమాల్లో పూజా హెగ్డే నటించింది కానీ ఇందులో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. కొట్లలో నష్టాలు మిగిలించిన ఈ సినిమాలు పూజాకి ఐరన్ లెగ్ ముద్రని తెచ్చాయి. ఆమె ఏ సినిమాలో నటించినా, అది ఫ్లాప్ అవుతుంది అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇదే సమయంలో రష్మిక తెలుగు నుంచి సరికొత్త పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది, బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇక పూజా కెరీర్ కి కష్టాలు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2023లో పూజా హెగ్డే రెండు సినిమాలతో ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇందులో ఒకటి ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ కాగా మరొకటి త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్ లో రూపొందనున్న ‘SSMB 28’. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో గుర్తింపు మాత్రమే తెచ్చుకున్న తనని స్టార్ హీరోయిన్ ని చేసిన త్రివిక్రమ్ మాత్రమే ఇప్పుడు పూజా హెగ్డే కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టగలడు. ‘SSMB 28’ హిట్ అయితే పూజా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లే, ఈ హిట్ ఇచ్చే బాధ్యత కూడా త్రివిక్రమ్ దే. మరి మాటల మాంత్రికుడు ఏ మాయ చేసి పూజా హెగ్డే కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!