Site icon NTV Telugu

2018 Telugu Collections: సైలెంటుగా కోట్ల కలెక్షన్లు వెనకేసిన బన్నీ వాసు!

2018 Movie Collections

2018 Movie Collections

2018 Telugu Closing Collections: ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇంకా అదే కోవలో అనేక సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత బన్నీ వాసు. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయగా తర్వాత తెలుగులో రిలీజై ఇక్కడా అదే రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించింది. టోవినో థామస్ నటించిన 2018 మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాం ఏరియాలో రూ.5.25 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ లో కలిపి రూ.5.60 కోట్లు వసూలు చేసింది.

Bro Pre Release Event: పోలీసుల హెచ్చరిక.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యం

మొత్తంగా రూ.10.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కాగా.. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.5.12 కోట్లు. ఈ సినిమా తెలుగులో ఓవరాల్ బిజినెస్ రూ.1.8 కోట్లుగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ రూ.2 కోట్లు అని ఫిక్స్ చేశారు. ఇక ఆ మార్క్ దాటిన ఈ సినిమా వసూళ్లు ఏకంగా రూ.3.12 కోట్ల లాభాలు వచ్చాయి. అనే సైలెంటుగా ఈ సినిమాతో ఏకంగా మూడు కోట్ల పైబడి సంపాదించారు బన్నీ వాసు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కించగా మొదట కేవలం మలయాళంలో రిలీజ్ చేసి తర్వాత కొన్ని రోజులకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీల్లోనూ రిలీజ్ చేశారు. ఇక జూన్ 7న 2018 సినిమా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసింది సోనిలివ్.

Exit mobile version