Site icon NTV Telugu

2018: కొంచెం ఆగి ఉంటే వండర్స్ జరిగేవి… తప్పు చేసారు

2018

2018

టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్ ని షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన 2018, ఇప్పటివరకు 160 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాని వెనక్కి నెట్టి 2018 సినిమా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతటి హిట్ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పైన బన్నీ వాసు రిలీజ్ చేసాడు. ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయని 2018 మూవీకి తెలుగు సినీ అభిమానులు హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా ఇస్తున్నారు. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి అంటే 2018 మూవీని మన ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరో వారం పాటు పెద్దగా ఇంపాక్ట్ చూపించే సినిమాలు విడుదల కావట్లేదు కాబట్టి దాదాపు 2018 సినిమా హవానే కొనసాగుతుంది.

ఇలా మంచి సినిమాలు తీస్తే తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తారు అని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేసారు. కేరళలో కూడా 2018 థియేటర్స్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే మేకర్స్ ఊహించని తప్పు చేసారు. జూన్ 7న సోనీ లివ్ లో 2018ని స్ట్రీమ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. మలయాళ ఎడిషన్ మాత్రమే ఓటీటీలో విడుదల అవుతుంది కానీ ఒక్కసారి ఓటీటీలోకి 2018 సినిమా వచ్చేస్తే కేరళలో ఈ మూవీ థియేటర్ రన్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అవుతుంది. సబ్ టైటిల్స్ ని ఆన్ చేసి చూసుకోవడం మొదలుపెడితే చాలు ఇతర భాషల్లో కూడా 2018 థియేటర్ రన్ ఎండ్ అయినట్లే. ఒక్క వారం లేదా పది రోజులు ఆగి ఉంటే 2018 సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది, మేకర్స్ ఎందుకో తొందర పడి ఈ తప్పుని చేసారు. తెలుగు వర్షన్ కి అయినా ఓటీటీలో రిలీజ్ చేయకుండా మరి కొన్ని రోజులు పాటు హోల్డ్ చేస్తారేమో చూడాలి.

Exit mobile version