NTV Telugu Site icon

‘1997’ చిత్రం కోసం పాట పాడిన మంగ్లీ!

Emi Bathuku Emi Bathuku Lyrical Video | 1997 Movie Songs | Mangli | Naveen Chandra | Koti | Dr Mohan

డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన మోహన్ తో నాకు చక్కని స్నేహం ఉంది. నేను చేసిన ‘బ్లేడ్ బాబ్జి’ సినిమాలో ఆయన నటించాడు. అప్పటినుండి తనతో ఈ అనుబంధం కొనసాగుతుంది. మోహన్ విద్య, వైద్య రంగాల్లో సూపర్ సక్సెస్ సాధించాడు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే సినిమా రంగంలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. చాలా పవర్ ఫుల్ కథ. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా రెండు పాత్రలు బాగా చేశాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట విన్నాను. చాలా ఎమోషన్ అయ్యాను. సామాజిక అసమానతల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రజల్లో చైతన్యం తేవాలంటే అది సినిమాల వల్లే సాధ్యం అని లెనిన్ మహనీయుడు చెప్పాడు. అందుకే ఇలాంటి సమస్యలను ప్రజలదగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్” అని అన్నారు.

హీరో మోహన్ మాట్లాడుతూ, ” ఈ కథ అనుకోగానే ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. నవీన్ చంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఇందులో ఓ సాంగ్ పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఈ సాంగ్ ని నేనే రాశాను. ఈ పాట విన్న కోటి గారు మంగ్లీ తో పాడించాలని చెప్పడంతో ఆమెతో పాడించాం. పాట చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరినీ కదిలించే సాంగ్ ఇది. అయితే ఈ సాంగ్ ని పెట్టించేందుకు మళ్ళీ షూటింగ్ చేయకుండా షూట్ చేసిన సన్నివేశాలే వాడాము. పాటకు ఆ సీన్స్ బాగా సింక్ అయ్యాయి. దీనిని మంగ్లీ పాడడంతో ఈ సాంగ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అని అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ”మోహన్ నాకు కొడుకు లాంటివాడు. అతను ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి” అని అభిలషించారు.

Show comments