Site icon NTV Telugu

1993 plane crash : 1993 విమాన ప్రమాదం.. ఇచ్చిన మాట తప్పిన బాలయ్య, చిరు

1993 Flyght Crash

1993 Flyght Crash

1993లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి  తో పాటు మరికొందరు నటీమణులు కూడా  ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు. అప్పటి సంఘటన గురించి  గుండ్ల పల్లె ఊరి గ్రామస్తులు, ప్రక్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు, కుర్చీలు, మంచాలు చేస్తున్న గ్రామస్థులు. విమానం విడిభాగాలను సైడ్ అద్దాన్ని భద్రంగా దాచుకున్నాం. మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరాము. వాళ్ళు హామీ అయితే ఇచ్చారు కానీ మళ్ళీ ఇటువైపు ఎప్పుడు రాలేదన్నారు గ్రామస్తులు.

విమానం ల్యాండ్ అయిన పొలం యజమాని వాసి జనార్ధన్ రెడ్డి ప్రమాదం గురించి మాట్లాడుతూ.. ‘విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫైలెట్ కిందకు దిగి ఓ చెట్టు దెగ్గరకు పరుగులు తీసి ఒణుకుతూ నిల్చున్నారు. తరువాత విమానంలో ఒక్కొకరుగా కిందకు దిగారు. విమానంలో అప్పటి సీఎం మర్రిచన్నా రెడ్డి కుమార్తె, మనవరాలు ఉన్నారు. సీఎం మర్రిచన్నారెడ్డి హెలికాప్టర్ లో ప్రమాద ప్రాంతానికి వచ్చారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమాన విడి భాగాలు ఊడిపోయాయి. అల్లు రామలింగయ్య విమానం పై నిల్చొని నిదానంగా దిగండి అని అన్నారు. మా గ్రామ దేవత దేశమ్మ కి చిరంజీవి మొక్కుకొని వెళ్ళారు. విమానం ల్యాండ్ అవ్వడంతో మా పొలంలో పంట పూర్తిగా పోయింది.

అప్పటి గుండ్ల పల్లె సర్పంచ్ దేశిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ, అల్లూరామలింగయ్య షాక్ కి గురై పొలం గట్టుపై కూర్చున్నారు.  వాళ్లందరికీ తాగేందుకు మజ్జిగ, నీరు ఇచ్చాను. అల్లురామలింగయ్య చాలా భయపడ్డారు. ఏమి కాలేదు బయపడకండి అని ధైర్యం చెప్పాను. మా గ్రామస్తులే విమానంలో ఉన్నవారికి సహాయం చేశారు. మా పంటకు నష్టపరిహారం చెల్లించారు.

గుండ్ల పల్లె గ్రామస్థులు మాట్లాడుతూ.. ఉదయం స్కూల్ కి వెళ్తున్న సమయంలో మా గ్రామం వైపు భారీ శబ్దం వచ్చింది. మాకు అది విమానం అని తెలియదు, వెంటనే పరుగులు తీశాము. విమానం పొలాల్లో ల్యాండ్ అయింది, దాదాపు అర కిలోమీటరు మేర భూమిపై రాసుకుంటు వెళ్ళింది. మేము విమానం దెగ్గరకు పరుగులు తీశాము, కానీ మమల్ని దెగ్గరకు రానివ్వలేదు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. మా గ్రామంలోని చెరువును, ఓ కొండను తప్పించి విమానం ల్యాండ్ అయింది. ఒకవేళ చెరువు గట్టుకు తగిలిన, చిన్న కొండను డి కొట్టిన పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఫైలెట్ విమానాన్ని చాలా చాకచక్యంగా ల్యాండ్ చేశారు.అందరూ బురదలో చిక్కున్నారు, వారిని మేము గట్టుమీదకు తీసుకొచ్చాము. తరువాత బెటాలియన్, పోలీసులు, హెలికాప్టర్ వచ్చింది. కొంతమందిని హెలికాప్టర్ లో, ఇంకొందరిని కార్లలో తీసుకెళ్లారు. ఆ విమానం ఒక సంవత్సరం పాటు మా గ్రామంలోనే ఉంచారు. మాకు విమానం ఎక్కే అవకాశం దొరికింది. సందర్శకులు ఎక్కువ వస్తుండడంతో విమానం దగ్గర చిన్నపాటి వ్యాపారాలు చేసుకున్నారు

Exit mobile version