సుదీర్ఘ నిరీక్షణ తర్వాత KGF Chapter 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. యష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సినిమా స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీమ్ పై విమర్శకుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్ విభాగం… ఈ సినిమాకు పని చేసిన ఎడిటర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు.
Read Also : Ranbir – Alia Marriage : హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ విషెస్
KGF Chapter 2 ఎడిటింగ్‌ను 19 ఏళ్ల కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి చేశాడనే విషయం ట్యాలెంటెడ్ టెక్నీషియన్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. KGF అనేది ఎంత పెద్ద ప్రాజెక్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇలాంటి ప్రాజెక్ట్ కు 19 ఏళ్ల కుర్రాడు ఇంత అద్భుతంగా ఎడిటింగ్ చేశాడంటే నమ్మశక్యంకాని విషయం. కానీ ఇదే నిజం… ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యువకుడి పనితనం, ప్రతిభను నమ్మి దర్శకుడు ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్-2” ఎడిటింగ్ మొత్తాన్ని ఉజ్వల్ చేతిలో పెట్టారట. ఆ అబ్బాయి కూడా అంతే కాన్ఫిడెంట్ తో సినిమాను అద్భుతంగా ఎడిట్ చేసి ప్రశాంత్ నీల్ ను మెప్పించాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోని ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అయితే ఈ ఆణిముత్యం ప్రశాంత్ నీల్ కు ఎలా దొరికాడంటే… ఉజ్వల్ షార్ట్ ఫిల్మ్స్, ఫ్యాన్ మేడ్ వీడియోలను ఎడిట్ చేసేవాడు. వాటిని చూసి ఫిదా అయిన ప్రశాంత్ నీల్ KGF 2లో ఎడిటింగ్ అవకాశాన్ని కల్పించారు. ఇంకేముంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, మొట్టమొదటి ఛాన్స్ తోనే నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఉజ్వల్ కు మరో రెండు ప్రాజెక్టులకు పని చేయబోతున్నట్టు తెలుస్తోంది.