బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి హోస్ట్ కింగ్ నాగార్జున “ఉల్టాపుల్టా” అని చెప్పినట్లు… షో కన్నా పోస్ట్ షో జరుగుతున్న విషయాలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు నుంచి ఇప్పటివరకు స్టేట్ లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు, అతను పరారీలో ఉన్నాడు అనే వార్త బయటకి రావడంతో… ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే హైడ్రామా తర్వాత పల్లవి ప్రశాంత్ మరియు అతని సోదరుడునీ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పలు సెక్షన్ ల కింద కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్, అతని సోదరుడిని గజ్వేల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత… నిన్న రాత్రి జడ్జి ముందు పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశ పెట్టారు. 17వ మెట్రో పాలిటెన్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ & సోదరుడిని చంచల్గూడా జైల్ తరలించారు.
శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసిపి మాట్లాడుతూ… “పల్లవి ప్రశాంత్ & సొదరుడు మహా విర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము, 14రోజుల పాటు మెజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహా విరాన్ లను గజ్వేల్ లో అరెస్టు చేసి నేరుగా మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరిచాము. కేసు దర్యాప్తులో ఉంది, మిగతా వారిని గుర్తిస్తున్నాము. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశాము. పోలీసులు చెప్పిన వినకుండా, పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్, తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. మొదట పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లు సాయికిరణ్, రాజులను అరెస్టు చేశాము” అని చెప్పారు.