Site icon NTV Telugu

Postponed: వారం ఆలస్యంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’

New Project (1)

New Project (1)

 

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా జూలై 1న రిలీజ్ కానుంది.

దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… నటుడు శ్రీరామ్ కీలక పాత్ర పోషించిన వెబ్ సీరిస్ ‘రెక్కీ’ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి మంచి పేరు వచ్చింది. ఆ వెబ్ సీరిస్ తో పాటే పనిలో పనిగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీ ప్రమోషన్‌ లోనూ శ్రీరామ్ చురుకుగా పాల్గొన్నాడు. అయితే 24న దాదాపు ఏడెనిమిది సినిమాలు విడుదల కానుండటంతో దర్శక నిర్మాతలు ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. పదోతరగతి నాటి అనుభవాల నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుందని దర్శకుడు అంజి చెబుతున్నారు.

Exit mobile version