Site icon NTV Telugu

‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్!

RRR

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. కేవలం ఆరు రోజులలో ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Read Also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్

ఇదిలా ఉంటే… హిందీ భాషపై మంచి పట్టున్న ఎన్టీయార్, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పకుంటున్నాడు. ఏ భాషలో అయినా నటుడు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటేనే ఆ పాత్రతో నూరు శాతం మమేకం అయినట్టు. అదే ఫీలింగ్ ను ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులకు ఎన్టీయార్ ఇవ్వబోతున్నాడు. విడుదలకు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7న జనం ముందుకు వచ్చాక ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Exit mobile version