NTV Telugu Site icon

Karthikeya 2: ఇంకా కృష్ణ ట్రాన్స్ లో ఉన్నాం భయ్యా.. అప్పుడే ఏడాది అయిపోయిందా.. ?

Karthikeya

Karthikeya

Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఇదే రోజున ఈ సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కృష్ణతత్వం గురించి గొప్పగా బోధించిన సినిమాల్లో కార్తికేయ 2 మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. ముఖ్యంగా కాలభైరవ అందించిన సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని మర్చిపోవడం అంత సులువైన పని కాదు. అన్నింటికీ మించి కృష్ణ ట్రాన్స్ ఇంకా అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికీ కార్తికేయ 2 ఎక్కడో ఒకచోట స్ట్రీమింగ్ అవుతూనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఈ సినిమా నిన్ననో, మొన్ననో రిలీజ్ అయినట్లు అనిపిస్తుందని అభిమానులు చెప్తున్నారు.

Suriya: క్లాస్ లుక్ లో.. ఏమున్నాడురా బాబు..

ఇక నేడు ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తుండడంతో హీరో నిఖిల్ చిత్ర బృందానికి, మీడియాకు పార్టీ ఇచ్చాడు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ” ఏడాది క్రితం ఇదే రోజున కార్తికేయ 2 రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఇంత మాస్సివ్ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలోనే తదుపరి పార్ట్ తో కలుస్తాను” అని తెలిపాడు. త్వరలోనే కార్తికేయ 3 రానుందని నిఖిల్ చెప్పడంతో అభిమానులు ఇంకా కృష్ణ ట్రాన్స్ లో ఉన్నాం భయ్యా.. అప్పుడే ఏడాది అయిపోయిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కార్తికేయ ప్రాంఛైస్ చేస్తూ హిట్ అందుకుంటున్న నిఖిల్ ఈసారి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments