Site icon NTV Telugu

సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికం ఎంతో తెలుసా?

Senior Actor Rajasekhar Key Role in Gopichand30

సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికంగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. చాలాకాలంగా రాజశేఖర్ చేతిలో సినిమాలు లేవు. “గరుడ వేగ”తో రీఎంట్రీ ఇచ్చిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అనంతరం “కల్కి”తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ఇటీవలే “శేఖర్” అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసం రాజశేఖర్ భారీ పారితోషికం తీసుకున్నారట.

Read Also : న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్

గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం రాజశేఖర్ ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండాలని ఆయన మేకర్స్ తో చెప్పారట. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. యూనిట్ ఆయన పెట్టిన అన్ని షరతులకు అంగీకరించిందట. రాజశేఖర్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మేకర్స్ రాజశేఖర్‌ హీరో తప్ప మరే ఇతర పాత్ర చేయలేదు.

Exit mobile version