Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్‌కు వెళ్లాలా.?
- గుండె ఆరోగ్యానికి యోగా, జిమ్ రెండూ ఉపయోగకరమే.
- జిమ్ గుండె పనితీరు, స్టామినాను పెంచుతుంది.
- యోగా ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- వారానికి 150 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం అవసరమని వైద్యుల సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yoga vs Gym: ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం వల్ల పెరుగుతున్న మరణాల్లో ‘‘గుండె సంబంధిత వ్యాధులు’’ ఎక్కువగా ఉంటున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, మద్యం-సిగరేట్ అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇదే కాకుండా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గుండె ఆరోగ్యం కోసం యోగా చేయడం బెటారా? లేక జిమ్ చేయడం బెటారా? అనే విషయం చాలా మందిని వేధిస్తుంటుంది.
జిమ్, యోగా రెండూ కూడా హార్ట్ హెల్త్‌కు చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు వేర్వేరు మార్గాల ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటిని వేరు చేయకుండా, రెండు మార్గాలను అనుసరిస్తే చాలా మంచిదని చెబుతున్నారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
జిమ్ ఎలా ప్రయోజనం:
వేగంగా నడబడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఫిట్నెస్ను మెరుగుపరుస్తాయి. గుండె సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. ఈ వ్యాయామం వల్ల తక్కువ శ్రమతో కండరాలకు, అవయవాలకు ఆక్సిజన్ ఉన్న రక్తం అందించడానికి వీలవుతుంది.
జిమ్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీని ఫలితంగా బీపీ కంట్రోల్ అవుతుంది. శరీరం బరువు అదుపులో ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. శారీరక సామర్థ్యం పెరుగుతుంది.
యోగా బెనిఫిట్స్:
జిమ్ వర్కౌట్లలా కాకుండా, యోగా శరీర సౌలభ్యం, శ్వాస, సమతుల్యత మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. ఇది వేగంగా నడవడం లేదా జాగింగ్ చేసినంతగా ఏరోబిక్ ఫిట్నెస్ను పెంచకపోయినా, గుండెకు మేలు చేసే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యోగా వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. గుండెపై ప్రభావం చూపించే హార్మోన్లు తగ్గుతాయి. శరీరం ప్లెక్సిబిలిటీ మెరుగవుతుంది. మానసిక శ్రేయస్సు పెరుగుతుంది. మనసును ప్రశాంత పరచడం వల్ల నాడీ వ్యవస్థ విశ్రాంతి పెరుగుతుంది.
ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా?
యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ గుండె పనితీరు, స్టామినా పెంచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని పూర్తిగా భర్తీ చేయదు. ఆరోగ్యవంతమైన పెద్దవారు వారానికి కనీసం 150 నిమిషాల పాటు మోస్తారు నుంచి తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి యోగా, జిమ్ ఒక్కటే పరిష్కారం కాదు. ఈ రెండింటిని సమతుల్యం చేయడం ద్వారా మరింత బెటర్ రిజల్ట్స్ పొందొచ్చు.
తాజావార్తలు
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!