NTV Telugu Site icon

Health: ఇలా చేస్తే వెన్ను నొప్పి మాయం ..

Untitled 2

Untitled 2

Health: ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి. ఈ వెన్నునొప్పి ఎక్కువ ఉద్యోగస్థుల్లో కనిపిస్తుంది. దీనికి కారణం ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేయడం. ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల మందులు పెయిన్ కిల్లర్ స్ప్రే లు వాడుతుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ పూర్తిగా తగ్గదు. కానీ ఈ ఒక్క పని చేస్తే వెన్ను నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది. అదే యోగ లోని మత్స్యాసనం. మత్స్యాసనం ద్వారా వెన్ను నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాన్ని చైర్లో కూర్చుని కూడా సులువుగా వేయవచ్చు. ఆసనం వేసే విధానం ఇప్పుడు చూదాం.

Read also:Delhi : అనుమానమే ఆ మహిళ ప్రాణం తీసింది

మొదటగా కుర్చీలో మామూలుగా కూర్చోండి.. అనంతరం మీ రెండు చేతులని ఫొటోలో చూపిన విధంగా పైకి తీసుకురండి. ఇప్పుడు వీపుని లోపలి వచ్చి చేతులు వెనక్కి చాచండి. ఈ భంగిమలో కాసేపు ఉండీ విశ్రాంతి తీసుకోండి. రోజు ఇలా చేస్తే వెన్ను నొప్పి నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. కనుక వెన్నునొప్పి తో బాధపడే వాళ్ళు నిత్యం ఈ మత్యాసనం ద్వారా వెన్ను నోపి నుండి ఉపశమనం పొందవచ్చు. అలానే యోగాని నిత్య జీవితంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలకి స్వస్తి పలికి ఆరోగ్యంగా ఉండొచ్చు.