Eye Care: మనం ఏమీ చూడాలన్నా కళ్లు ప్రధానం. కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకో గలుగుతాము. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు కంటి సమస్యలు ఉంటున్నాయి. కంటి సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో కంటి సమస్యలతో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో 2018 మొదటి విడత కంటి వెలుగును ప్రారంభించగా.. ఈ ఏడాది జనవరి 18న రెండో విడతను ప్రారంభించారు. అయితే కంటి సమస్యలు రావడానికి చాలా వరకు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమేనని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. కంటి నిండా నిద్ర లేకపోయినా.. సరైన శారీరక శ్రమ లేకపోయినా కంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమీ, శారీరక శ్రమే కాకుండా ఇంకా వేరే కారణాలతో కూడా కంటి సమస్యలు తలెత్తనున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం..
Read also: Stock Market Opening: రేసుగుర్రంలా దూసుకుపోతున్న మార్కెట్లు
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (NPCB) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో దాదాపు 12 మిలియన్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారని తేలింది. గతంలో వయస్సు మీదపడిన తర్వాతే.. కంటి సమస్యలు, దృష్టి లోపం వచ్చేది. కానీ ఈ డిజిటల్ కాలంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లేకుండా రోజు గడవటం కష్టమవుతుంది. కంప్యూటర్, మొబైల్‌లను గంటల తరబడి చూస్తూ ఉండటంతో.. కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఒత్తిడి, పోషక ఆహార లోపం, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ వాడకం కారణంగా.. దృష్టి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచం డిజిటల్ స్క్రీన్లతో నిండిపోయింది. టెలివిజన్, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు.. ఇలా ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజు స్కీన్ చూస్తూ ఎంత సమయం గడుపుతున్నారో దాన్ని స్క్రీన్ టైమ్ అంటారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ చూస్తుంటే.. మీ కంటి చూపును దెబ్బతీస్తుంది, ముఖ్యంగా పిల్లలలో ఒత్తిడికి కారణం అవుతుంది. మీ పిల్లల స్క్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నారో అనేదానిపై నియంత్రణ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని కంటి నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ ఊపిరితిత్తులు, గుండెకు ఎంత హాని చేస్తుందో, కళ్లకూ అంతే హానిచేస్తుంది. స్మోకింగ్ మాక్యులార్ డీజెనరేషన్, కంటిశుక్లం, ఆప్టిక్ నరాలు దెబ్బతినడం వంటి ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యలు దృష్టిలోపానికి దారితీస్తాయి. అంతేకాకుండా 50 ఏళ్లు పైబడిన పెద్దవారిలో దృష్టిని కోల్పోవడానికి క్యాన్సర్ ప్రధాన కారణం
Read also: Realme Narzo 60 Series Launch: రియల్‌మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
డయాబెటిస్, హైపర్‌టెన్షన్, అధిక బరువు, థైరాయిడ్ వంటి దీర్షకాలిక వ్యాధులను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. కంటి చూపు క్షీణించే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్ ఎక్కువైతే.. హైపర్‌టెన్సివ్ రెటినోపతి సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. నీరు సరిపడా తాగకపోయినా కంటి సమస్యలు తలెత్తుతాయయి. శరీర ఉష్ణోగ్రత, ఇతర జీవసంబంధమైన విధులను నియంత్రించడానికి మన కణాలు, అవయవాలు, కణజాలాలకు నీరు అవసరం. కన్నీళ్ల ఆకారంలో ఉండే నీరు మన కళ్లను తేమగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వాతావరణంలోని దుమ్ము, మలినాలు, ఇతర కణాలు మన కళ్లకు చేరడం సహజం. కళ్లలో తేమ లేకపోతే.. కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, వాపు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. కళ్లు పొడిబారతాయి. ఎర్రటి కళ్లు, నల్లటి వలయాలు, కాంతి సున్నితత్వం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర లేమి శరీరంలోని హార్మోన్లు, న్యూరోనల్ మార్పులకు కారణం అవుతుంది. ఈ మార్పులు బలహీనమైన దృష్టిని తీవ్రం చేస్తాయి. శారీరక శ్రమ లేకపోయినా కంటి చూపు బలహీనపడుతుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే కంటికి కాస్త రిలీఫ్ ఇస్తూ కంటిని కాపాడుకుంటూ.. కంటి చూపును కాపాడుకోవల్సిన అవసరం ఉందని కంటి నిపుణులు చెబుతున్నారు.