Winter Season Food : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్ధం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.. ఈ కాలంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. కాలానుగుణ ఆహారాన్ని తినడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఫలితంగా శరీరాన్ని లోపలి నుంచి నుంచి వెచ్చగా ఉంచుకోవచ్చు. అటువంటి ఆహారాల్లో క్యారెట్లు ముందు వరుసలో ఉంటాయి. క్యారెట్లు ఏడాది పొడవునా లభిస్తుంటాయి. అయితే, శీతాకాలంలో తాజా క్యారెట్లను తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
మెంతికూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెంతుల పొడిని వివిధ వంటలలో కూడా ఉపయోగించవచ్చు.. ఆవాల్లో ఫోలేట్, ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. చలికాలంలో ఈ కూరగాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. నువ్వులు శీతాకాలంలో తప్పనిసరిగా తినవల్సిన పదార్థం. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే నువ్వుల లడ్డూ తినవచ్చు.. పాలకూరను శీతాకాలపు సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.. ఈ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!