NTV Telugu Site icon

Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?

Oranges

Oranges

చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో సీజనల్‌ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి. సంవత్సరంలో ఒక్క ఈ సీజన్‌లో మాత్రమే నారింజ లభిస్తాయి.. నారింజ తినడం వల్ల విటమిన్ సి వంటి అవసరమైన పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. నారింజలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.. ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నారింజ రసం తాగవచ్చు. నారింజలు సిట్రస్ పండు కాబట్టి, నారింజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి..

వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.. చర్మ రక్షణలో ఇవి సహాయపడతాయి.. నారింజ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండాలంటే చలికాలంలో తప్పనిసరిగా నారింజను తినాలి. నారింజలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి… అంతేకాదు గుండె జబ్బులను కూడా తగ్గిస్తాయి.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు…

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.