Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి. సంవత్సరంలో ఒక్క ఈ సీజన్లో మాత్రమే నారింజ లభిస్తాయి.. నారింజ తినడం వల్ల విటమిన్ సి వంటి అవసరమైన పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. నారింజలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.. ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నారింజ రసం తాగవచ్చు. నారింజలు సిట్రస్ పండు కాబట్టి, నారింజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.. చర్మ రక్షణలో ఇవి సహాయపడతాయి.. నారింజ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండాలంటే చలికాలంలో తప్పనిసరిగా నారింజను తినాలి. నారింజలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి… అంతేకాదు గుండె జబ్బులను కూడా తగ్గిస్తాయి.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?