Site icon NTV Telugu

Winter Season: చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Sapota

Sapota

చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఇక పండ్లను కూడా నిపుణుల సలహా తీసుకొని తినడం మంచిది..అయితే ఈకాలంలో సపోటాల ను తినడం మంచిదేనా? అనే సందేహం కలగడం కామన్.. కానీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి. సపోటాలో డైటరీ ఫైబర్ ఉంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

అంతేకాదు సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్న సపోటాలను మహిళలు గర్భధారణ సమయం లో తింటే మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య వున్నవారికి ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. సపోటాలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.. షుగర్ పేషంట్స్ మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తాయి…

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version