Site icon NTV Telugu

Pregnant Women Health Tips: శీతాకాలంలో గర్భిణుల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు ఇవే..

Pregnant Women

Pregnant Women

Pregnant Women Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. చలి శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అధిక లేదా తక్కువ రక్తపోటుకు గురి కావాల్సి వస్తుంది, ఇది తల్లి, బిడ్డలిద్దరికీ ప్రమాదకరం అని అన్నారు. చల్లని గాలులు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని, దీని వల్ల అలసట, తలతిరుగుడు, బలహీనత ఏర్పడుతాయని చెప్పారు. అలాగే విటమిన్ డి లోపం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా గర్భిణీలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందువల్ల ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఆ జాగ్రత్తలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..

శీతాకాలం అనేది గర్భిణులను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి ఇప్పటికే బలహీనంగా ఉంటుందని, ఈ సమయంలో ఫ్లూ, జలుబు, న్యుమోనియా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి గర్భిణుల్లో అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. చల్లని ఉష్ణోగ్రతలు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి, దీని వలన చేతులు, కాళ్లు చల్లబడటం, తిమ్మిరి, రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయన్నారు. కొంతమంది మహిళలు కీళ్ల నొప్పులు, అలసట, శ్వాస సమస్యలతో కూడా బాధపడవచ్చన్నారు. అందుకే శీతాకాలంలో గర్భిణులు క్రమం తప్పకుండా వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు. శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవాలని వైద్యులు వెల్లడించారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని, పగటిపూట తేలికపాటి వ్యాయామం లేదా నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, అలాగే శరీరాన్ని చురుగ్గా ఉంచుతుందని చెప్పారు. నీటి తీసుకోవడం పరిమితం చేయవద్దని, చలిలో దాహం తక్కువగా ఉంటుందని, కానీ శరీరానికి హైడ్రేషన్ అవసరం అన్నారు.

వీటిని ట్రై చేయండి..

* రోజూ తేలికపాటి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి.

* నీరు, వేడి సూప్ తీసుకోవడం కొనసాగించాలి.

* చాలా చల్లగా ఉండే వస్తువులను తినడం మానుకోవాలి.

* వైద్యుల సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.

* ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్‌లు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కమ్ బ్యాక్ అప్పుడే అంటా!

Exit mobile version