Red Fruits, Vegetables: ఎరుపు రంగు పండ్లలో ఇన్ని రకాల పోషకాలున్నాయని మీకు తెలుసా..
- చలికాలంలో మనం గాలిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో..
- మనం వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ
- రోగ నిరోధక పెంచే గుణాలున్న ఎర్రటి పండ్లు, దుంపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం రాగానే గాలిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మన శరీరం సీజనల్ ఇన్ఫెక్షన్లకు బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు రావడం సాధారణం. అంతేకాకుండా చలిలో గుండెపై ఒత్తిడి పెరగబట్టి, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం చలికాలంలో గుండెపోటు ప్రమాదం సుమారు 53% వరకు పెరుగుతుంది.
అయితే ఈ సమస్యలను నివారించడంలో ఎర్రటి పండ్లు మరియు ఎర్రటి దుంపలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
దానిమ్మలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడుతాయి. హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. చలికాలంలో దానిమ్మను ఆహారంలో చేర్చడం హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది.
క్రాన్బెర్రీస్లో ఉండే సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటిని పెంచి జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోజు ఒక యాపిల్ డాక్టర్‌ను దూరంగా ఉంచుతుంది” అనే మాటకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. రెడ్ యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ రెండు యాపిల్స్ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు
బీట్రూట్లో విటమిన్లు, నైట్రేట్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణ నష్టాన్ని తగ్గిస్తాయి. శరీర సహజ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చలికాలంలో బీట్రూట్ను సలాడ్, జ్యూస్ లేదా ఉడికించిన రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
చలికాలంలో ఎర్రటి పండ్లు, దుంపలను ఆహారంలో సంపూర్ణంగా చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి చలి సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!