సాధారణం చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. 1990 – 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే చలికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని.. కానీ కొన్ని పద్దతుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు.
Read Also:Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..
చల్లని వాతావరణం – ఇన్ఫెక్షన్లు శరీరంపై ఒత్తిడిని పెంచడంతో పాటు ఇన్సులిన్ పని చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో డయాబెటిస్ అంత తొందరగా కంట్రోల్ కాదని.. దాని కోసం కొన్ని పద్దతులు అలవాటు చేసుకుంటే వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చుంటున్నారు. చలి కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతుంటాయి.. దీంతో డయాబెటిస్ పెషెంట్లు..రీరం అదనపు గ్లూకోజ్‌ను నిర్వహించలేనందున అలసట, శక్తి లేకపోవడం వంటి లక్షణాలకు గురవుతుంటారు. ఎక్కువ నీరు తాగడం.. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో చక్కెర బయటకు వెళ్లడం వంటి జరుగుతుంటాయి.తలనొప్పి, తలతిరగడం, కంటి చూపు కూడా మసకబారినట్లు కనిపిస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా డయాబెటిస్ పేషెంట్లను మరింత దిగజార్చే అవకాశం ఉందంటున్నారు.
Read Also: Credit Score: క్రెడిట్ స్కోరు బాగున్నా.. లోన్ రావడం లేదా… కారణాలేంటో తెలుసా..
అయితే కొన్ని హెల్త్ టిప్స్ తో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.. ముఖ్యంగా ఎప్పటికప్పడు.. డయాబెటిస్ ను చెక్ చేస్తూ ఉండాలి.. ఉష్ణోగ్రత, శరీర స్థితిలో మార్పులు చలి కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు కారణమవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యోగా, చిన్నపాటి ఎక్సర్‌సైజులు, వాకింగ్ చేయడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశాలున్నాయని తెలిపారు. అధిక చక్కెర పెరుగుదలను నివారించడానికి మీ ఆహారంలో ప్రోటీన్, అధిక ఫైబర్ కూరగాయలు, తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవాలని చెబుతున్నారు నిఫుణులు. ఇన్ఫెక్షన్లను నివారించడానికి.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వెచ్చని దుస్తులు ధరించడం. అవసరమైతే టీకాలు వేయించుకోవడంతో.. షుగర్ ను కంట్రోల్ చేసుకోవంటున్నారు.
ఈ సమాచారాన్ని మేము ఇంటర్నెట్ మాత్రమే గ్రహించాం. కాబట్టి మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా.. వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
