Site icon NTV Telugu

Weight Loss : చలికాలంలో సులువుగా బరువు తగ్గాలంటే ఇది తాగాల్సిందే..!

Weight Loss

Weight Loss

ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట అధిక బరువు.. ఇది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం చాలా సులభం.. కానీ తగ్గడం చాలా కష్టం.. మరీ ముఖ్యంగా చలికాలంలో బరువు తగ్గడం మరింత కష్టం.. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి పెరుగుతున్న బరువు కారణంగా ఆందోళన చెందుతున్నారు. స్థూలకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. చలికాలంలో ఈ డ్రింక్స్ ను తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ..

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దాని రసం చేయడానికి ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, దోసకాయ, అల్లం ఒక జార్లో వేసి జ్యూస్ సిద్ధం చేయండి. దానికి నిమ్మరసం కలపండి. దీన్ని తాగడం వల్ల శరీరానికి తాజాదనంతోపాటు బరువు కూడా తగ్గుతుంది…

అలాగే స్ట్రాబెర్రీ, ఆపిల్, నిమ్మకాయ ముక్క తీసుకోండి. అన్ని పదార్థాలను బాగా కడగాలి. ఈ పండ్లన్నింటినీ ముక్కలుగా కోయండి. ఇప్పుడు వాటిని ఒక జారులో వేసి జ్యూస్ సిద్ధం చేయండి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది..

గ్రీన్ జ్యూస్.. దోసకాయ, యాపిల్, నిమ్మకాయలను ఉపయోగించి డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని చేయడానికి రెండు కప్పుల బచ్చలికూర, ఒక దోసకాయ, రెండు యాపిల్స్, ఒక ఒలిచిన నిమ్మకాయ, అల్లం కావాల్సి ఉంటుంది.. వీటిని కడిగి ముక్కలు చేసి జ్యూస్ చేసుకొని పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..

బరువు తగ్గాలనుకుంటే బీట్‌రూట్ రసం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి బీట్‌రూట్, క్యారెట్, ఆపిల్, నిమ్మకాయలను తీసుకోండి. వాటిని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.. వీటిని జ్యూస్ చేసుకొని తాగితే బరువును సులువుగా తగ్గవచ్చు.. ఇవన్నీ సింపుల్ టిప్స్ మీరు కూడా ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version