Site icon NTV Telugu

Weight Loss Tips : నిమ్మరసంలో వీటిని కలుపుకొని తాగితే చాలు .. కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..!

Weight Loss

Weight Loss

బరువు పెరిగినంత సులువుగా తగ్గడం కష్టం.. బరువు తగ్గాలని అనుకొనేవారు.. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు ఎంత పెద్ద పొట్ట అయినా కూడా ఇట్లే తగ్గిపోతుంది.. అయితే ఎటువంటి చిట్కాను పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్య తో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాల తో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగుతూ అరగంట పాటు వ్యాయామం కూడా చెయ్యాలి…

ఈ డ్రింక్ ను తయారు చెయ్యడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్లాసున్నర నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక 15 తాజా పుదీనా ఆకులు, ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర స్పూన్ అల్లం తురుము, నాలుగు లేదా ఐదు నిమ్మకాయ ముక్కలు వేసి ఏడు నిముషాల పాటు మరిగించాలి.. ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయం లో ఈ డ్రింక్ తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version