Here Is Biggest Weight Loss Mistakes You Should Avoid: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే తన అందంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. అందంగా కనబడడం కోసం తన బరువును అదుపులో ఉంచుకోవాలని నిత్యం తాపత్రయపడుతుంటారు. చాలా మంది బరువును అదుపులో ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ని ఫాలో అవుతారు. అయితే ఇంత చేసినా కొందరు బరువు తగ్గక పోగా పెరుగుతారు. దాంతో ఏం చేయాలో వారికి అర్థం కాదు. ఇలా జరగడానికి కారణం బరువు తగ్గే క్రమంలో వారు కొన్ని తప్పులు చేయడమే. ఆ తప్పిదాలు ఏంటో ఓసారి చూద్దాం.
తక్కువగా తినడం:
తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుందని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధక సమస్య ఎదుర్కుంటారు. అప్పుడు బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మెదడు మనం ఇబ్బందుల్లో ఉన్నామని భావిస్తుంది. అప్పుడు శారీరక ప్రక్రియ నెమ్మదిస్తుంది. అప్పుడు బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023.. మాట మార్చిన పీసీబీ కొత్త ఛైర్మన్!
నిద్రలేమి:
బరువు తగ్గించడంలో నిద్ర ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ 6 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. నిద్రలేమి బరువు తగ్గాలని ప్రయత్నించే వారిలో పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది. 8 గంటలు నిద్రించే వారి శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
ఒకే చోట కూర్చోవడం:
ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా మీ శరీరం లైపేస్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. దీని కారణంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా.. కాసేపు నడవాలి.