Site icon NTV Telugu

Waxing vs Threading: కనుబొమ్మలు అందంగా కనిపంచాలంటే ఏది సరైనది? థ్రెడింగ్? వ్యాక్సింగ్?

Waxing Vs Threading

Waxing Vs Threading

Waxing vs Threading: మహిళల కళ్ల గురించి ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించడం చూసే ఉంటాము. నిజానికి మహిళల అందంగా ఉన్నారని అని చెప్పడానికి కళ్లు ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి కాళ్లను మహిళలు అందంగా ఉంచడానికి అనేక పద్ధతులను వాడుతుంటారు. ఇక మహిళలకు కళ్లే ముఖ్యం అనుకుంటే.. కనుబొమ్మల ఆకృతి మహిళల అందాన్ని మరింతగా హైలైట్ చేసే ముఖ్యమైన భాగం.

కళాశాలలో చదువుతున్న అమ్మాయిలైనా, ఉద్యోగంలో ఉన్న మహిళలైనా, గృహిణులైనా ఎవరైనా సరే అందమైన కనుబొమ్మల ఆకృతి ముఖానికి పరిపూర్ణమైన లుక్ ఇస్తుంది. కనుబొమ్మల ఆకారం సరిగ్గా లేకపోతే, మేకప్ ఎంత బాగున్నా అది పెద్దగా ఫలితం ఉండదు. ఇక బ్యూటీ పార్లర్లలో కనుబొమ్మల ఆకృతికి ప్రధానంగా రెండు పద్ధతులు ప్రాచుర్యం పొందాయి. అవే థ్రెడింగ్, వ్యాక్సింగ్ లు. ఈ రెండూ మంచి ఫలితాలను ఇస్తున్నా చాలామంది మహిళలు ఏది ఎంచుకోవాలో అయోమయానికి లోనవుతుంటారు. మరి దాని తేడాలంతో ఒకసారి చూద్దామా..

Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?

థ్రెడింగ్ ఎలా చేస్తారు?
థ్రెడింగ్ అనేది ఒక సాంప్రదాయ పద్ధతి. మందపాటి దారంతో అదనపు వెంట్రుకలను మూలం నుండి తొలగించడం ఇందులో జరుగుతుంది. ఇది చిన్న వెంట్రుకలనూ సులభంగా తొలగించి, కనుబొమ్మలకు పదునైన ఆకృతిని ఇస్తుంది. అయితే, ఈ ప్రక్రియలో కొంత నొప్పి ఉంటుంది. దారాన్ని చర్మంపై ఉపయోగించడంతో, కొన్నిసార్లు చర్మంపై ఎరుపు లేదా చికాకు కలగవచ్చు.

వ్యాక్సింగ్ ఎలా చేస్తారు?
వ్యాక్సింగ్ ఒక ఆధునిక పద్ధతి. ఇందులో వాక్స్ స్ట్రిప్స్‌ ఉపయోగించి కనుబొమ్మలపై ఉన్న అదనపు వెంట్రుకలను తొలగిస్తారు. ఈ పద్ధతి తక్కువ సమయం తీసుకుంటుంది. ఇందులో నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కనుబొమ్మలు శుభ్రంగా, సాఫ్ట్‌గా కనిపిస్తాయి. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది దద్దుర్లు లేదా చికాకు కలిగించే అవకాశం ఉంటుంది.

HTC Vive Eagle: వాయిస్ కమాండ్స్‌తో ఫోటోలు, వీడియోలు, ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు.. AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ లాంచ్!

ఏది మంచిది?
ఎవరికైతే సున్నితమైన చర్మం ఉన్నవారు థ్రెడింగ్ ఎంచుకోవడం మంచిది. ఇది పదునైన ఆకృతిని ఇస్తుంది. అలాగే, వ్యాక్సింగ్ వల్ల కలిగే దద్దుర్ల సమస్య రాదు. ఇక నొప్పిని తట్టుకోలేనివారు వ్యాక్సింగ్‌ను ప్రయత్నించవచ్చు. ఇది తక్కువ నొప్పితోపాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మొత్తం మీద మీ చర్మ స్వభావం, వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా థ్రెడింగ్ లేదా వ్యాక్సింగ్ పద్ధతిని ఎంచుకోవచ్చు.

Exit mobile version