Site icon NTV Telugu

Health Tips : దీన్ని ఒక్కసారి తీసుకుంటే చాలు..షుగర్ కంట్రోల్ అవుతుంది..

Diabets

Diabets

ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు.. బ్రతికినంత కాలం మందులను వాడుతూ కంట్రోల్ చేసుకోవాలి.. కొన్ని రకాల ఆహారాలతో పాటు, కొన్ని పండ్లను తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ కాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు..ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్ మార్కెట్ లలో, రోడ్ల పక్కన బండ్ల మీద ఈ పండ్లు మనకు విరివిరిగా లభిస్తాయి. అలాగే ఈ పండ్ల చెట్టును కూడా మనం సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో పండే కొద్దిగా ఎర్రగా మారతాయి. అలాగే ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

షుగర్ పేషంట్స్ కు ఇవి దివ్య ఔషదం అనే చెప్పాలి..ఈ పండ్లు షుగర్ ను కంట్రోల్ చేస్తాయి..ఈ వాటర్ యాపిల్స్ కు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గొప్ప గుణం ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఐసో మెరిక్ ప్లేవనోన్, చాల్ కోన్ అనే రెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు..

ముఖ్యంగాజీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అందుకే ఇవి ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి..

Exit mobile version