NTV Telugu Site icon

త్వ‌ర‌గా మేల్కొటున్నారా… మీ ఆరోగ్యం ప‌దిల‌మే…

క‌రోనా కాలంలో ఆరోగ్యంపై శ్ర‌ద్ధ మ‌రింత‌గా పెరిగింది.  క‌ర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి అమ‌లు జరుగుతుండ‌టంతో కొంత సమ‌యం మాత్రమే బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తులు ఉండ‌టంతో ఉద‌యాన్నే లేవ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు.  ఉద‌యాన్నే లేవ‌డం వ‌ల‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇలా త్వ‌రగా లేచే వారికి గుండె జ‌బ్బులు, ఊబ‌కాయం వంటివి ద‌రిచేరే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.  ఆల‌స్యంగా ప‌డుకొని, ఆల‌స్యంగా నిద్ర‌లేచే వారికి ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు.  కొన్నిసార్లు ఆల‌స్యంగా ప‌డుకొని, త్వర‌గా నిద్ర‌లేవ‌డం, త్వ‌ర‌గా ప‌డుకొని ఆల‌స్యంగా నిద్రలేవ‌డం వంటివి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇలా చేయ‌డం వ‌ల‌న జీవ‌న‌గడియారంలో అవ‌క‌త‌వ‌క‌లు ఏర్ప‌డ‌తాయ‌ని, గుండెపై ఒత్తిడి పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.