Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..
- ఒకప్పటి క్లాస్ టాప్, ఇప్పుడు రాపిడో రైడర్..
- జీవితం నేర్పే పాఠం చెప్పిన రైడర్..
- మార్కులు, డిగ్రీలే జీవితం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapido Story: జీవితం అందరికి ఒకేలా ఉండదు. ఒకప్పుడు క్లాస్ టాపర్‌గా, చదువులో చురుగ్గా ఉన్న వ్యక్తి కూడా పరిస్థితుల ప్రభావం, అవకాశాల లభించకపోవడం, అదృష్టం వెక్కిరించడం వల్ల సాధారణ జీవితం గడపొచ్చు. వేరే సందర్భంలో చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్నా కొందరు ఉన్నతస్థాయికి వెళ్లొచ్చు. దీనికి ఉదాహరణనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ‘‘రాపిడో బైకర్’’ కథ. నిజమైన భవిష్యత్తుకు చదువు అద్దం కాదు, కాలమే నిజమైన పరీక్ష పెడుతుందనే దానికి ఇది చక్కని ఉదాహరణ.
ఒక వ్యక్తి రాపిడో రైడ్ బుక్ చేసుకున్న సమయంలో, రాపిడో రైడర్‌గా వచ్చిన వ్యక్తి ఒకప్పటి తన ఫ్రెండ్ చందన్ అని, చిన్నప్పుడు చదువుల్లో టాప్‌గా ఉండే వ్యక్తి రాపిడో నడుపుకుంటూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవ్వడం ఈ వ్యక్తి వంతైంది. నిజానికి మొదట రాపిడో రైడర్ పేరు తన ఫ్రెండ్ పేరును పోలి ఉందని అనుకున్నాడు. కానీ వచ్చిన రైడర్‌ని చూసినప్పుడు, ఒకప్పుడు చదువుల్లో రాణించిన తన మిత్రుడని గుర్తించాడు.
Also Read
- Smoking While Drinking Tea: 'టీ'తో పాటు 'సిగరెట్' తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
- Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
చదువు, జీవితానికి సంబంధం లేదు:
చదువు, జీవితానికి మధ్య సంబంధం లేదని చెప్పడానికి రాపిడో రైడర్ జీవితమే ఉదాహరణ. చదువుల్లో రాణించినంత మాత్రాన జీవితంలో గెలిచి, గొప్ప స్థానానికి వెళ్తామనే గ్యారెంటీ లేదు. చదువుల్లో రాణించే వారు అవకాశాలను అందిపుచ్చుకోక వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. ఇక కుటుంబ పరిస్థితులు వల్ల చదువుల్ని మధ్యలో వదిలేసి, వేరే పనులు చేసే వారు మరికొందరు. జీవితాన్ని మార్కులు, డిగ్రీలు మాత్రమే నిర్ణయించవు. కొన్ని సందర్భాల్లో మోస్తారు విద్యార్థులు కూడా ఇప్పుడు గొప్పస్థానాల్లో ఉన్నారు.
రైడర్ జీవిత పాఠం అద్భుతం:
రైడర్ చెప్పే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. అతడి జీవితం లాగే నా జీవితం కూడా ఉందని కామెంట్స్ పెడుతున్న వారు ఉన్నారు. తన ఫ్రెండ్‌తో చందన్ మాట్లాడుతూ.. ‘‘ఏం చింతింకండి, నేను మీకు ఛార్జీ వసూలు చేయను. ముందు ఓటీపీ చెప్పు’’ అని తన ఫ్రెండ్‌తో మాట్లాడటం ప్రారంభించారు. ‘‘జీవితం ఎల్లప్పుడూ ప్రణాళిక ప్రకారం సాగదు, మిత్రమా… కానీ పర్వాలేదు. నేను రైడర్ అవుతానని, నువ్వు నా కస్టమర్ అవుతావని నేను ఎప్పుడూ ఊహించలేదు. జీవితం అనిశ్చితం. ఇప్పుడు కూర్చోండి, నేను నిన్ను సురక్షితంగా దింపేస్తాను’’ అని అన్నారు. మార్కులు, డిగ్రీలు, టాపర్‌గా ఉండటం భవిష్యత్తుకు హామీ కాదు. మనం చేసే ఏ పనైనా గౌరవమైనదే. నిజాయితీగా మన పని మనం చేయాలని చందన్ జీవితం చేబుతోంది.
He booked a Rapido in a hurry… never imagining the rider would be his own class topper.
Umar was getting late, so he quickly booked a ride.
The booking got confirmed. The rider’s name showed: Chandan.At first, he ignored it. Then he paused… Could this be our class topper… pic.twitter.com/qgNlKjcKPx
— Bharat Mata Ke Sewak (@PatrioticSoul33) March 2, 2026
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!