మన సంప్రదాయం, నమ్మకం ప్రకారం గ్రహరాశులు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈమధ్యకాలంలో వీటిని నమ్మే జనం ఎక్కువయ్యారనే చెప్పాలి. ఫిబ్రవరి 27 నుండి శనిదేవుని రాశి కుంభరాశిలో త్రిగ్రాహి యోగం(Trigrahi yog) ఏర్పడింది. శనిదేవుడు కుంభరాశిలో మొదటి స్థానంలో ఉన్నాడు, ఆ తర్వాత సూర్యుడు వచ్చాడంటున్నారు జ్యోతిష్య పండితులు. శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి కుంభంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి అపారమయిన ధన లాభం కలగనుంది. వారి జీవితం మారనుంది. బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. ఆ మూడురాశులేంటో తెలుసుకోండి.. ఆ రాశుల్లో మీరు కూడా ఉంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆలోచించండి. ఆచరించి సత్ఫలితాలు పొందండి.
Read Also: Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్‌కు బెదిరింపులు.. చంపేస్తానన్న ప్రియాంకా గాంధీ పీఏ
వృషభ రాశి: వృషభరాశి వారికి కుంభరాశిలో శని-బుధ-సూర్యుడు కలయిక శుభం కలుగచేస్తుంది. ఈ యోగం వృషభ రాశి వారికి అద్భుత అవకాశాలను కలిగిస్తుంది. ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఈ మూడు గ్రహాల సంచారం జరగబోతోంది. కనుక కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉందని కూడా జ్యోతిష్యం చెబుతోంది. ఉద్యోగం చేస్తున్నవారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పని చేసే చోట మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. ఈయోగం వల్ల ఈ రాశి వ్యక్తుల గౌరవాన్ని, కీర్తి పెరుగుతుంది.
మిధున రాశి: కుంభరాశిలో శని-బుధుడు, సూర్యుని కలయిక ఈ రాశివారి దశ,దిశను మార్చబోతోది. ఈ రాశివారికి త్రిగ్రాహి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు అనేక రకాల శుభవార్తలు వినిపిస్తాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ధనలాభం కూడా ఉంటుంది. మీ పూర్వీకుల పరంగా మీకు మంచి ఆస్తి , డబ్బు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వీరికి ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. వ్యాపార రంగంలో సువర్ణావకాశాన్ని పొందవచ్చు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కాలంలో కొన్ని కలలు కూడా నెరవేరుతాయి. మీరు ఆచితూచి వ్యవహరించాలి.
కుంభ రాశి: కుంభరాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మంచి ఫలితాలు సంభవిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మంచి పురోగతి, మంచి సంపద కారణంగా మీ ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులను తెస్తుంది. విజయం మీకు లభిస్తుంది. గత కొన్ని రోజులుగా అపజయం పాలవుతున్న వారు ఇప్పుడు విజయానికి చేరువ అవుతారు. అకస్మాత్తుగా ధనలాభానికి అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ రోజూ సూర్యనమస్కారాలు లాంటివి ఆచరించాలి.
Read Also:Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్‌కు బెదిరింపులు.. చంపేస్తానన్న ప్రియాంకా గాంధీ పీఏ