Site icon NTV Telugu

Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!

Best Fruits For Kidney

Best Fruits For Kidney

Best Fruits For Kidney Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ‘కిడ్నీ’ (మూత్రపిండం). ఇది బాగుంటేనే మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే.. శరీరం నుంచి వ్యర్థ ఉత్పత్తులను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అందులకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్:
పండ్లలో పైనాపిల్ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.

బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. కిడ్నీ దెబ్బతినకుండా బ్లూబెర్రీ కాపాడుతుంది. యూరినరీ ట్రాక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లూబెర్రీస్ సహాయపడతాయి.

నిమ్మకాయ:
నిమ్మరసం కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మకాయ వినియోగం మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.

Also Read:
Umpire Nitin Menon: అనుకూల నిర్ణయాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. భారత ఆటగాళ్లపై అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు!
పుచ్చకాయ:
వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎందుకంటే పుచ్చకాయ హైడ్రేటింగ్ పండు. ఇందులో చాలా నీరు ఉంటుంది. పుచ్చకాయను తినడం వల్ల మీ శరీరం డీ హైడ్రేట్‌ కాదు. కిడ్నీ ఆరోగ్యానికి పుచ్చకాయ బెస్ట్ ఫ్రూట్. ఇది కిడ్నీలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఆపిల్:
యాపిల్‌లో చాలా ఫైబర్‌ ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ సమ్మేళనం ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించబడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Also Read: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Exit mobile version