Site icon NTV Telugu

Dry Fruits for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ నాలుగు డ్రై ప్రూట్స్ ట్రై చేయండి..

Untitled Design (4)

Untitled Design (4)

 

బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి.

అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా పాలన్ వెల్లడించారు.. ఇవి బరువు తగ్గడంలోనే కాదు, మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్నారు.  అయితే… నిపుణులు సూచించిన 4 డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం:

బరువు తగ్గడానికి సహాయపడే 4 ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్

1. బాదం:
బాదంలో ఎక్కువగా మెగ్నిషియం, విటమిన్ ఈ, కాపర్, కాల్షియం, ప్లాంట్ ప్రోటీన్ అధికంగా ఉంటాయని న్యూట్రిషిన్స్ చెబుతున్నారు. బాదంలో ఉన్న ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తాయి.జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ బాదం తీసుకునే వారి బరువు, డ్రై ఫ్రూట్స్ ఎట్టి రకంగా తీసుకోని వారితో పోలిస్తే మరింత తగ్గినట్లు గుర్తించారు. ప్రతిరోజూ 4–5బాదం తీసుకోవాలని డైట్‌షియన్ ప్రియా పాలన్ సూచిస్తున్నారు.

2. ఆక్రోట్ (Walnuts)

ఆక్రోట్‌లో అధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.ఇవి శరీరంలోని వాపు తగ్గించడం,
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.కేలరీలు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ, నియంత్రిత పరిమాణంలో తీసుకుంటే ఇవి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయన్నారు. ఆక్రోట్ తినే వారికి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి.. ఓవర్‌ఈటింగ్‌ను తగ్గిస్తుంది.

3. వేరుశెనగలు (Peanuts)

వేరుశెనగలను “పేదల బాదం” అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు.ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించి ఆకలిని తగ్గిస్తాయి. న్యూట్రిషన్ జర్నల్ లోని ఒక పరిశోధన ప్రకారం, భోజనానికి ముందు 35 గ్రాముల వేరుశెనగలు తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుందని సర్వే తేల్చి చెప్పింది.

4. ఖర్జూరం (Dates)

ఖర్జూరంలో సహజ చక్కెర,ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఖర్జూరం యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెరుగైన మెటబాలిక్ ఆరోగ్యం కోసం ప్రయోజనకరంగా ఉంటుందని న్యూట్రిషియన్లు పేర్కొన్నారు. అదనంగా, ఖర్జూరం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటంతో మిఠాయిలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చుంటున్నారు.

అయితే ఈ సమాచారం మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే న్యూట్రిషియన్ సంప్రదించవచ్చు.

Exit mobile version