Health Tips: ఆధునిక యాంత్రిక జీవితంలో చాలా మంది ప్రశాంతత కోసం కొత్తకొత్త మార్గాలను వెతుకుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే సమయం వరకు ఎన్నో టెన్షన్లు.. పని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది యువత టాయిలెట్‌ను బెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇదే నిజం. దీనికి కొందరు ఏకంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అని పేరు కూడా పెట్టారు. అయితే గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవడం, ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు వాడుతూ గడపడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Bhuvneshwari Kumari: ‘కాస్తైనా సిగ్గుండాలి’.. లలిత్ మోడీపై శ్రీశాంత్ సతీమణి ఫైర్!
30 నిమిషాలకు మించి కూర్చుంటే..
టాయిలెట్‌లో 30 నిమిషాలకు మించి కూర్చుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈసందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది నరాలను కుదించి, తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. ఇటీవల 30 నిమిషాలు టాయిలెట్‌లో కూర్చున్న ఒక వ్యక్తి పక్షవాతానికి గురైనట్లు ఒక సంఘటన నిరూపిస్తుంది. ఎక్కువ సమయం టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల వెనముకకు ఆక్సిజన్, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఒక 40 ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి టాయిలెట్‌లో నిద్రపోగా.. లేచి నిలబడలేకపోయాడు. చికిత్స తీసుకున్నా కూడా అతను పూర్తిగా కోలుకోలేకపోయాడు. ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చుంటే సయాటిక్ నర్వ్ చికాకు పెడుతుంది. దీనివల్ల కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే..
టాయిలెట్ సీటుపై ప్యాడెడ్ కవర్ ఉపయోగించడం మంచిది. టాయిలెట్ వాడిన తర్వాత మీ కాళ్లు గట్టిపడినట్లు లేదా తిమ్మిరిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో భాగమైనప్పటికీ, వాటిని ఉపయోగించే సమయం, ప్రదేశం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తాత్కాలిక సంతోషం కోసం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.
వైద్య నిపుణుల సలహా ప్రకారం.. టాయిలెట్‌లో 10-15 నిమిషాలకు మించి ఉండకూడదు. మొబైల్ ఫోన్‌లను టాయిలెట్‌కు తీసుకెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది టాయిలెట్‌లో గడిపే సమయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. చదవడం లేదా మొబైల్ ఫోన్ వాడకం వంటి అలవాట్లను టాయిలెట్‌లో మానుకోవాలి.
READ ALSO: Amit Shah: అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
