Site icon NTV Telugu

Tomato Face Mask: టొమాటోనే కదా అని తేలికగా తీసుకోవద్దు.. మీ బుగ్గలును గులాబీ రంగులో మెరిపిస్తుంది..!

Tomato Face Mask

Tomato Face Mask

Tomato Face Mask: కొన్ని నిత్యం మన కళ్లు ముందు కనిపించేవాటితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. వాటి గురించి తెలిసినప్పుడు.. ఔరా! అనిపించక మానదు.. టమోటా కేవలం వంటల్లో రుచిని పెంచడానికే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా టమోటా మరియు కలబంద తో తయారుచేసే ఫేస్ మాస్క్ చర్మాన్ని శుభ్రపరచి సహజ కాంతిని తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. ఈ సహజ ఫేస్ మాస్క్ మచ్చలు తగ్గించడంలో, టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

అవసరమైన పదార్థాలు
– సగం పండిన టమోటా
– 1–2 టీస్పూన్లు తాజా కలబంద జెల్
– ½ టీస్పూన్ తేనె
– ¼ టీస్పూన్ పసుపు పొడి
– 1 టీస్పూన్ శనగపిండి

ఫేస్ మాస్క్ తయారు చేసే విధానం
ముందుగా టమోటాను బాగా కడిగి పేస్ట్‌లా చేసుకోవాలి.. కలబంద ఆకును కోసి అందులోని జెల్ తీసుకోవాలి.. ఒక గిన్నెలో టమోటా పేస్ట్, కలబంద జెల్ వేసుకోవాలి.. అందులో తేనె, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి.. మెత్తగా పేస్ట్‌లా అయ్యే వరకు కలపాలి. అవసరమైతే కొద్దిగా కలబంద జెల్ లేదా శనగపిండి జోడించవచ్చు.

ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలి
ముందుగా ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి… మాస్క్ వేసే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది… తరువాత ఈ మాస్క్‌ను ముఖం మరియు మెడపై అప్లై చేయాలి.. కళ్ల చుట్టూ, పెదవుల చుట్టూ అప్లై చేయకుండా జాగ్రత్త పడాలి.. 15–20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.. ఉత్తమ ఫలితాల కోసం వారానికి 1–2 సార్లు ఉపయోగించవచ్చు.

ఈ ఫేస్ మాస్క్ ప్రయోజనాలు
టమోటాలో ఉండే విటమిన్ C చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.. టానింగ్ తగ్గించి చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది… కలబంద చర్మాన్ని ప్రశాంతపరచి చికాకును తగ్గిస్తుంది.. చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అయితే, ఇది కేవలం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించిన సమాచారం.. వీటిని అప్లై చేసే టప్పుడు వైద్యుల సలహా తీసుకుంటే బెటర్..

Exit mobile version