Rumali Roti Recipe: ఇంట్లోనే మృదువైన రుమాలి రోటీ ఇలా తయారు చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rumali Roti Recipe: భారతీయ వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రత్యేక రోటీ.. రుమాలి రోటి.. ఇది చాలా సన్నగా, మృదువుగా ఉండే రోటీగా రెస్టారెంట్లు మరియు ధాబాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సరైన విధంగా తయారు చేస్తే ఈ రోటీ చాలా తేలికగా, దాదాపు పారదర్శకంగా ఉంటుంది. సాధారణ గోధుమ రోటీ లేదా పరాఠా తినడం బోర్ అనిపిస్తే, రుమాలి రోటీ మంచి ఎంపికగా చెప్పుకోవాలి.. ఇంట్లోనే తక్కువ సమయంలో ఈ రుచికరమైన రోటీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం.
రుమాలి రోటీ అవసరమైన పదార్థాలు
– 3 కప్పుల గోధుమ పిండి
– 1 కప్పు మైదా పిండి
– సుమారు 2 కప్పుల నీరు (పిండిని కలపడానికి)
– పొడి పిండి (రోటీ చుట్టడానికి)
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
రుమాలి రోటీ తయారీ విధానం
– ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి మరియు మైదా పిండి వేసి బాగా కలపాలి.
– కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండేలా పిండిని ముద్దగా కలుపుకోవాలి.
– పిండిని మూతపెట్టి 2 నుండి 3 గంటలు పక్కన ఉంచాలి. దీంతో పిండి బాగా మృదువుగా అవుతుంది.
– ఇప్పుడు పిండితో చిన్న చిన్న బంతులు చేసుకోవాలి.
– గ్యాస్‌పై పాన్‌ను తలక్రిందులుగా ఉంచి బాగా వేడి చేయాలి.
– పిండిని తీసుకుని పొడి పిండి సహాయంతో చాలా సన్నగా చుట్టాలి. రోటీ చాలా పలుచగా ఉండాలి.
– వేడిగా ఉన్న పాన్‌పై రోటీని వేసి 10–12 సెకన్లు ఎక్కువ మంటపై కాల్చాలి.
– చిన్న బుడగలు వచ్చి లేత గోధుమ రంగు వచ్చిన తర్వాత మరో వైపు తిప్పాలి.
– రెండో వైపు కూడా లేతగా కాల్చిన తర్వాత పాన్ నుంచి తీసి నాలుగు మడతలు పెట్టాలి.
ఇలా తయారైన వేడి వేడి రుమాలి రోటీను కర్రీలు, పనీర్ వంటకాలు లేదా చికెన్ గ్రేవీలతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. అసలే యుద్ధాలతో గ్యాస్ కొరత ఏర్పడి.. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూత పడుతోన్న తరుణంలో.. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!