Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
- రాఖీ పండుగకు స్వీట్‌గా కాజు కట్లీ ఇలా చేయండి
- జీడిపప్పు పొడి తయారీలో ఈ టిప్ మిస్ కావద్దు
- సాఫ్ట్‌గా కాజు కట్లీ రావాలంటే ఇలా కలపండి
- హెల్తీగా ఉండే జీడిపప్పు ప్రయోజనాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Festival Recipes : తోబుట్టువుల మధ్య పవిత్రమైన అనురాగానికి, పదిలమైన బంధానికి ప్రతీక రక్షా బంధన్. శ్రావణ పౌర్ణమి వేళ జరుపుకునే ఈ పండుగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి, తీపి తినిపించడం మన సాంప్రదాయం. మరి ఈ రక్షా బంధన్ వేడుకల్లో బయటి స్వీట్లతో పనిలేకుండా, మీ చేతులతోనే అత్యంత శుభ్రంగా, సులభంగా , తక్కువ సమయంలో ‘కాజు కట్లీ’ (జీడిపప్పు కట్లీ) ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
జీడిపప్పు – 2 కప్పులు, పంచదార – 1 కప్పు, నీళ్లు – 1 కప్పు, యాలకుల పొడి – 1/2 టీస్పూన్, నెయ్యి – 1 నుండి 2 టేబుల్ స్పూన్లు, బటర్ పేపర్ , అలంకరణకు సిల్వర్ ఫాయిల్.
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
తయారీ విధానం:
జీడిపప్పు పొడి తయారు చేయడం: మొదటగా 2 కప్పుల జీడిపప్పును మిక్సర్ జార్లో వేసి పొడి చేసుకోవాలి. అయితే మిక్సర్‌ను నిరంతరం తిప్పకుండా ఆన్-ఆఫ్ (Pulse) చేస్తూ మూడు నాలుగు విడతలుగా గ్రైండ్ చేయాలి. అలా చేయడం వల్ల జీడిపప్పు నుంచి నూనె విడుదల కాకుండా పొడిపొడిగా వస్తుంది. ఈ పొడిని జల్లించి పక్కన పెట్టుకోవాలి.
పాకం పటడం: ఒక బాణలిలో కప్పు పంచదార, కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి నీరు మరిగిన తర్వాత, పొయ్యిని సన్నని మంట మీద ఉంచి జల్లించిన జీడిపప్పు పొడిని వేసి బాగా కలపాలి.
మిశ్రమాన్ని ఉడికించడం: ఉండలు కట్టకుండా కలుపుతూ యాలకుల పొడి వేయాలి. మిశ్రమం దగ్గరపడి పాత్ర అంచుల నుండి విడిపోతున్న సమయంలో పొయ్యి కట్టేయాలి.
చదును చేయడం & కట్ చేయడం: ఒక పళ్లెంలో బటర్ పేపర్ పరిచి, దానికి కాస్త నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. పైన మరొక బటర్ పేపర్ ఉంచి చపాతీ కర్ర లేదా గరిటెతో సమాన మందంలో చదును చేయాలి. మిశ్రమం కాస్త చల్లారాక పైన సిల్వర్ ఫాయిల్ అంటించి, కత్తితో డైమండ్ (వజ్రం) ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. ఎంతో రుచికరమైన, మార్కెట్ స్టైల్ కాజు కట్లీ సిద్ధమైనట్లే! దీనిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది.
జీడిపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలు:
కాజు కట్లీ రుచికరంగా ఉండటమే కాకుండా జీడిపప్పు వల్ల శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్, కండరాల పుష్టికి సహాయపడే ప్లాంట్ ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని, రక్తప్రసరణను మెరుగుపరిచే మెగ్నీషియం, ఐరన్, జింక్ , కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు జీడిపప్పులో పుష్కలంగా లభిస్తాయి.
తాజావార్తలు
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
-
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?